Rajiv Yuva Vikasam scheme: నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. వ్యాపారానికి 3 లక్షల రుణం.. చివరి తేది ఏప్రిల్ 5

Rajiv Yuva Vikasam scheme
Rajiv Yuva Vikasam scheme

Rajiv Yuva Vikasam scheme: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గొప్ప శుభవార్తను ప్రకటించింది. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించనున్నట్లు సర్కార్ తెలిపింది. జూన్ 2న 5 లక్షల మంది నిరుద్యోగులకు 3 లక్షల చొప్పున రుణాలను అందజేసి పథకాన్ని ప్రారంభిస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులకు వ్యాపారం చేయడానికి 3 లక్షల రుణాన్ని మంజూరు చేస్తామని, ఇందులో 80 శాతం సబ్సిడీ అందజేస్తామని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని యువత స్వయంగా వ్యాపారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఏప్రిల్ 5వ తేది లోపు అర్హులైన నిరుద్యోగులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని పథకానికి అర్హులైన నిరుద్యోగులను ఎంపిక చేసే బాధ్యత తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో అనర్హులను ప్రోత్సహించవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి, అట్టడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువకులు ఈ పథకానికి అర్హులని, ఇందుకోసం 6000 కోట్ల రూపాయల నిధులను రాజీవ్ యువ వికాస పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్నది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు వ్యాపారం చేసుకోవడానికి 3 లక్షల రూపాయల రుణాన్ని అందించడంతోపాటు సుమారు 60 నుండి 80% సబ్సిడీ కూడా ఈ పథకంలో కల్పించనున్నారు. రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కింద యువత ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హత:

* తెలంగాణ రాష్ట్రం నివాసి అయి ఉండాలి.
* ఒక్కొక్క లబ్ధిదారులకి 3 లక్షల వరకు రుణం.
* రాష్ర్టంలోని 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం.
* రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగులు అర్హులు.
* కుల, ఆదాయ ధ్రువీకరణతోపాటు ఆధార్ గుర్తింపు కార్డు అవసరం.
* మంజూరి అయ్యే రుణాన్ని బట్టి 60 నుండి 80% సబ్సిడీ వస్తుంది.
* దరఖాస్తు చేసుకునేసరికి నిరుద్యోగి అయి ఉండాలి.
* మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ.
* ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన.
* జూన్ 2న నిధుల మంజూరు పత్రాల పంపిణీ.
* https://tgobmmsnew.cgg.gov.in ఈ అధికారికా వెబ్సైట్ లో మరిన్ని వివరాలు.
* నిరుద్యోగుల నుండి ఈ పథకానికి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తారు.
* గమనిక: మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని మండల కార్యాలయాల్లో అధికారులను సంప్రదించండి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now