Chanakya Niti: ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను తన నీతి శాస్త్రంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి తెలిపారు. అందులో వైవాహిక జీవితంతో పాటు వృత్తి, ఆరోగ్యం మరియు ఉపాధి వంటి అనేక విషయాల గురించి ప్రస్తావించాడు. నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు ఇతరులకు సహాయం చేయడం గురించి కూడా తెలిపాడు. కొన్ని కొన్ని సార్లు మీరు ఇతరులకు చేసే సహాయం ఇతరులకు ప్రయోజనం కలిగించదని అది మీ జీవితానికి కూడా హాని కలిగిస్తుందని ఆయన తెలిపాడు. ఒకరు వేరొకరికి సహాయం చేయడం పవిత్రమైన చర్యగా చెప్తారు. ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తిని ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి సంకేతంగా అందరూ పరిగణిస్తారు.
పనులు సరిగ్గా జరగని సమయంలో తమ నిస్సహాయతను అర్థం చేసుకొని ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటారు. అటువంటి సందర్భాలలో మీరు చేసే సహాయం అవతల ఉన్న వ్యక్తికి ప్రయోజనం కలిగించదు. అది మీకు కూడా హానికారకంగా మారే అవకాశం ఉంది. ఇటువంటి మూడు రకాల వ్యక్తులకు సహాయం చేయడం హానికరం అని ఆచారా చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. సంస్కారహీనమైన స్త్రీలకు దూరంగా ఉంటే మంచిదని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. ఇటువంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే వైవాహిక జీవితాన్ని ఆ స్త్రీ నాశనం చేస్తుందని కాబట్టి అటువంటి స్త్రీలను ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని ఆచార్య చానిక్యుడు తెలిపాడు. ఇటువంటి మహిళలకు దూరంగా ఉండడం మంచిదని తెలిపాడు. మూర్ఖుడైన శిష్యుడు ఏ పాఠాన్ని కూడా అర్థం చేసుకోలేదు.
గురువు ఒక తెలివి తక్కువ విద్యార్థి కోసం తన సమయాన్ని మరియు శక్తిని వృధా చేసుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. కాబట్టి ఇతరులు చెప్పేది వినకుండా ముర్కంగా వాదించే వారి గురించి చింతించకండి అంటూ చాణక్యుడు తెలిపాడు. ఇటువంటి వారికి కూడా వీలైనంత దూరంగా ఉండాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ప్రతికూల శక్తిని విడుదల చేస్తాడు. అనారోగ్యంతో అతను ఎప్పుడు కూడా విచారంగా ఉంటాడు. అటువంటి వ్యక్తులతో పరిచయం, స్నేహం వంటివి మీకు ముందుకు సాగనివ్వవు. అందువలన నీతి శాస్త్రంలో ఆచారాచానిక్యుడు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి దూరం పాటిస్తే మంచిదని తెలిపాడు. ఒక వ్యక్తి జీవితంలో ముందుకు సాగాలంటే అతను అబద్ధాలు, మద్యం సేవించడం, స్వార్థపరులు మరియు దురాచపరులకు ఎప్పుడు దూరంగా ఉండాలని నీతి శాస్త్రంలో ఆచార చాణిక్యుడు బోధించాడు.