HERO BALAKRISHNA: బాలయ్య బర్త్ డే స్పెషల్ గా అఖండ-2.. మూవీ అప్డేట్స్.. ఫ్యాన్స్ కు పండగే

Akhanda 2
Akhanda 2

HERO BALAKRISHNA: బాలయ్య బర్త్ డే స్పెషల్ గా అఖండ-2.. మూవీ అప్డేట్స్.. ఫ్యాన్స్ కు పండగే

నందమూరి బాలకృష్ణ బర్త్ డే వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. ఏటా బాలయ్య పుట్టిన రోజున ఏదో ఒక స్పెషల్ పోస్టర్లు, టీజర్లు కొత్త ప్రాజెక్ట్ డిటేల్స్ అనౌన్స్ చేస్తుంటారు. జూన్ 10న బాలయ్య బర్త్‌డే సందర్భంగా రెండు భారీ అప్డేట్స్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మంచి హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ అఖండతో భారీ హిట్ అందుకున్నారు. కాగా బర్త్ డే స్పెషల్ గా అఖండ 2 చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.

అఖండ –2 సినిమా షూటింగ్..

అఖండ –2 సినిమా ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల వరకు షూటింగ్ పూర్తి అయినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల టాక్. దర్శకుడు బోయపాటి ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం బాలయ్య పుట్టినరోజునే స్పెషల్ టీజర్ విడుదల చేసేందుకు బోయపాటి ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీని కోసం ఇప్పటికే కొన్ని షూట్స్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ వర్క్ కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య వీరసింహరెడ్డితో హిట్ కొట్టాడు. ఇదే డైరెక్టర్ తో మరో సినిమా చేసేందుకు బాలయ్య అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జూన్ 10 వ తేదీనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాలతో కాకుండా మరో రెండు ఫిల్మ్స్ తో బాలయ్య తన పుట్టిన రోజు తర్వాత ఫుల్ బిజీగా మారిపోనున్నాడు. మొత్తానికి నందమూరి అభిమానులకు బాలకృష్ణ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు తెలియడంతో ఆనందంతో గంతులేస్తున్నారు. అఖండ 2 టీజర్ ఒక వైపు. మరోవైపు కొత్త సినిమా అనౌన్స్ మెంట్ గురించి చెబుతారనే వివరాలు బహిర్గతం కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

పాన్ ఇండియా లెవెల్లో హీరోల చిత్రాలు..

ఇప్పటికే టాలీవుడ్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తూ బాగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో హిందీ సినిమా హిరోల కంటే వీళ్లే ఎక్కువ పాపులర్. అలాంటిది బాలకృష్ణ కూడా పాన్ ఇండియా సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు కూడా సంబరపడిపోతున్నారు. అఖండ 2 లో బాలయ్య బాబు ఫర్మామెన్స్ అదిరిపోతుందని భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now