Dreams: ప్రతి ఒక్కరికి కూడా నిద్రపోతున్న సమయంలో కలలు రావడం సాధారణం. కానీ స్వప్న శాస్త్రంలో కలలకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి కలకు కూడా ఒక ప్రత్యేకమైన అర్ధాన్ని గురించి స్వప్న శాస్త్రంలో చెప్పబడింది. కొన్ని కలలు మనకు పరిణామాలడు సూచిస్తే మరికొన్ని అపశకునంగా భావిస్తూ ఉంటారు. మరి కొన్ని కలలు ధన సంపద మరియు శుభపరిణామాలను సూచిస్తాయి. కొన్ని కలలు వ్యర్థంగా అనిపిస్తాయి కానీ మరి కొన్ని కలలు మాత్రం భవిష్యత్తుపై ప్రభావం చూపే సంకేతాలుగా స్వప్న శాస్త్రంలో చెప్పబడింది.
కొన్ని ప్రత్యేక కళలు త్వరలో ధన సంపాదన వచ్చేలా చేస్తాయని సంకేతాలుగా చెప్పబడింది. అలాంటి కళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ కలలో దీపం వెలుగుతున్నట్లు కనిపిస్తే అది చాలా మంచి శుభసంకేతం. దీపం వెలగడం అంటే అంధకారాన్ని తొలగించడం. ఈ విధంగానే మీ జీవితంలో కూడా కష్టాలు పోయి శుభాలు ప్రారంభమవుతాయని అర్థం.
చెవులకు ఆభరణాలు వేసుకున్నట్లు మీ కలలో కనిపిస్తే ధనం సమృద్ధిగా రాబోతుందని సంకేతంగా పరిగణించవచ్చు. అనుకోకుండా ఎక్కడినుంచి అయినా డబ్బు రావచ్చు. ఆర్థిక స్థితిని ఈ కల సూచిస్తుంది. అలాగే కలలో చేతికి ఉంగరం వేసుకున్నట్లు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉందని సంకేతం. ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోయి స్థిరమైన సంపద వస్తుందని అర్థం. గులాబీ, కమలం పువ్వులు కలలో కనిపిస్తే శుభ సూచకంగా పరిగణించాలి.
ఈ రెండు పువ్వులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. మీరు చేసే ప్రతి పని విజయం అవుతుందని దీని అర్థం. అలాగే త్వరలో మీకు ధన సంపద కూడా వస్తుందని అర్థం. కలలో పాలు తాగుతున్నట్లు కనిపిస్తే ఇంట్లో అభివృద్ధి, శాంతి, ధనం చేరుతాయని అర్థం. మంచి ఆరోగ్యం మరియు సంపాదనకు సూచనగా ఈ కల సూచిస్తుంది. కలలో పాములు చాలామందికి భయాన్ని కలిగిస్తాయి. కానీ పాములు కనిపించడం మంచిదిగా భావిస్తారు. మీ జీవితంలో ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అర్థం. ఒక పెద్ద ధన లాభం లేదా ఆస్తి మీకు అందవచ్చు అని ఈ కల సూచిస్తుంది.