Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతికార సుంకాలపై కీలక అప్డేట్…మన దేశంపై ఎంతంటే.!

Donald Trump
Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పటినుంచి మరో లెక్క అని తేల్చి చెప్పారు. సుంకాల విషయంలో ఏ దేశాన్ని కూడా వదిలిపెట్టేదే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు అన్ని ఊహించినట్టే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకార సుంకాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. లిపరేషన్ డే సందర్భంగా ఆయన 60 కి పైగా దేశాలపై ప్రతీకార సంఘాలను ప్రకటించారు. అధికారిక ఉత్తర్వులపై కూడా ఆయన సంతకాలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇతర దేశాలపై విధించిన టారిఫ్ లు అమలులోకి వస్తాయని స్పష్టంగా చెప్పారు.

లిబరేషన్ డే సందర్భంగా మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించిందని చెప్పుకొచ్చారు. చాలా ఎండుగా అమెరికాను మోసగాళ్లు ఉపయోగించుకున్నారని మండిపడ్డ ట్రంప్ ఇకమీదట అలా జరగదని స్పష్టంగా తెలిపారు. తమపై సుంకాలు విదిస్తున్న దేశాలపై తాము కూడా తప్పకుండా సంకలు విధిస్తామని ఈరోజు అమెరికాకు నిజమైన ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి క్యాబినెట్ సభ్యులు తోపాటు స్టీల్ మరియు ఆటో కార్మికులను కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై 26% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్ భారతదేశ ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. తనకు మోదీ మంచి స్నేహితుడని కానీ అమెరికాతో భారత సరైన విధంగా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై భారత 52 శాతం సుంకాలను విధిస్తుందని చెప్పారు. అలాగే చైనాపై 34% సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ట్రంప్ మాట్లాడుతూ వాణిజ్యంలో కొన్ని కొన్ని సార్లు శత్రువు కంటే కూడా స్నేహితుడు చాలా ప్రమాదకరమని తెలిపారు. అమెరికా దేశం దిగుమతి చేసుకుంటున్నా ఆటోమొబైల్స్ పై కేవలం 2.4 శాతం సుంకాలను విధిస్తుందని కానీ కొన్ని దేశాలు తమ ఉత్పత్తులపై భారీ టారిఫ్ అమలు చేస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now