Home బిజినెస్ UPI Circle Feature: UPI పేమెంట్స్ లో కొత్త ఫీచర్.. ఖాతాలో డబ్బులు లేకున్నా పేమెంట్...

UPI Circle Feature: UPI పేమెంట్స్ లో కొత్త ఫీచర్.. ఖాతాలో డబ్బులు లేకున్నా పేమెంట్ చేయొచ్చు

UPI Circle Feature: UPI పేమెంట్స్ లో కొత్త ఫీచర్.. ఖాతాలో డబ్బులు లేకున్నా పేమెంట్ చేయొచ్చు
UPI Circle Feature: UPI పేమెంట్స్ లో కొత్త ఫీచర్.. ఖాతాలో డబ్బులు లేకున్నా పేమెంట్ చేయొచ్చు

UPI Circle Feature: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వ్యవస్థ యూపీఐ సర్కిల్ అనే కొత్త ఫీచర్ ను తాజాగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కడ చూసిన డిజిటల్ యుగం నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ లేకుండా దాదాపు అన్ని పనులు కూడా ఆగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యూపీఐ ప్రజాధరణ చాలా వేగంగా పెరిగింది. 20 రూపాయల వాటర్ బాటిల్, ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొనడం దగ్గర నుంచి పెద్ద కొనుగోలు చేయడం వరకు ప్రజలు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజల జీవితంలో యూపీఐ చెల్లింపులు ఒక ముఖ్యమైన భాగంగా అయిపోయాయి. ప్రజలు నగదును తమ వెంట తీసుకొని వెళ్లడం కంటే యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇది చాలా సులభం కాబట్టి ఈ సౌకర్యం దాదాపు ప్రతి చోట అందుబాటులో ఉంది. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఏమైనా కొని వారి ఫోన్ నుండి యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తారు. ఈ క్రమంలో ఆ పేమెంటు మీ బ్యాంకు ఖాతా నుండి డెబిట్ అవుతుంది. తాజాగా ఈ కొత్త ఫీచర్ ప్రకారం మీ యూపీఐ మీ ఖాతాను ఉపయోగించి వాళ్ళు చెల్లింపులు చేయవచ్చు.

ఈ ఫీచర్ను యూపీఐ సర్కిల్ అంటారు. ఈ కొత్త ఫీచర్లో యూపీఐ ఖాతాదారుడు ఇతర వ్యక్తులు తమ ఖాతా నుండి చెల్లింపులు చేయడానికి కూడా అనుమతి ఇస్తుంది. యూపీఐ సర్కిల్ అనేది భారత దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వ్యవస్థకు చెందిన కొత్త ఫీచర్. ఈ కొత్త ఫీచర్ ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసింది. యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ యుపిఐ ఖాతాను కుటుంబ సభ్యులు లేదా విశ్వసనీయ స్నేహితులు లేదా స్నేహితురాళ్లతో పంచుకోవచ్చు. ఈ క్రమంలో వారు మీ ఖాతాను ఉపయోగించి లావాదేవీలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ టీచర్ భీమ్ యాప్ ద్వారా ఉపయోగించవచ్చు. క్రమక్రమంగా ఈ కొత్త ఫీచర్ ఇతర యూపీఐ యాప్ లలో కూడా అందుబాటులోకి రానుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now