Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు కారణం నేను కాదు

Rohit Sharma
Rohit Sharma

Rohit Sharma: రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడానికి కారణం కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమని ప్రకటించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సడెన్ గా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ప్రకటనపై చాలా మంది బీసీసీఐ పై విమర్శలు చేస్తున్నారు. ఇటు గౌతమ్ గంభీర్ ను కూడా విమర్శిస్తున్నారు.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఇండియన్ క్రికెట్ టీం కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. అసలు రోహిత్ శర్మకు నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి మీకు ఏం తెలుసు.. ఛాంపియన్స్ ట్రోపీలో విజేతగా నిలవడానికి చేసిన కృషి గురించి తెలియకుండా అనసరంగా ఆరోపణలు చేస్తున్నారు. ట్రోపీలు అంటే ఒక్కరు సాధించే విజయాలు కాదు. అందరూ కలిసి ఆడితేనే గెలుపు సాధ్యమవుతుంది. రోహిత్ శర్మకు నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు.. ఒక క్రికెటర్ గా రోహిత్ శర్మ ఇండియా క్రికెట్ టీంకు ఎంత చేయాలో అంత చేశాడు. క్రికెట్ ను ఎక్కువగా ప్రేమించే వాళ్లలో రోహిత్ శర్మ ఒకడు.

రోహిత్ శర్మకు నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియక ఎవరినీ ఏ ప్రశ్న వేయాలో తెలియక.. సంబంధం లేని ప్రశ్నలు అడుగుతూ.. అసలు ఎలాంటి హోం వర్క్ చేయకుండా యూట్యూబ్ చానల్ రేటింగ్ కోసం ప్రశ్నలు అడుగుతున్నారంటే మీ బలహీనత ఎంటో అర్థమవుతుంది. టీఆర్పీ రేటింగ్ ల కోసం, యూట్యూబ్ చానల్స్ లో వ్యూస్ కోసం ఎలాంటి హోం వర్క్ చేయకుండా ప్రశ్నలు అడిగి దాన్ని వివాదం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు కారణం గౌతమ్ గంభీర్, బీసీసీఐ అని వస్తున్న పుకార్లపై ఘూటుగా స్పందించాడు.

తాజాగా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ కావడాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హిట్ మ్యాన్ సడెన్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు ఇండియాలో జరిగిన న్యూజిలాండ్ తో మూడు టెస్ట్ సిరీస్ మ్యాచులో కూడా రాణించలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియాలో జరిగిన అయిదో టెస్టు మ్యాచులో రోహిత్ స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వచ్చే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇప్పటి నుంచే టీం ను సన్నద్ధం చేసే విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసకునే అవకాశం ఉందని.. ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్టుల్లో రోహిత్ ను తీసుకునే అవకాశం లేదని అందుకే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించారని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి స్పందనగా కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాపై గుస్స అయ్యాడు. నిజనిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఒకరి గురించి ఇంటర్వ్యూ చేస్తున్నపుడు హోం వర్క్ చేయకుండా అసత్యాలు ఎలా రాస్తారంటూ మండిపడ్డారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now