SRH IPL 2025: సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఐపీఎల్ 2025 లో ఇప్పటి వరకు తొమ్మి ది మ్యాచులు ఆడి కేవలం మూడింట్లో మాత్రమే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఏప్రిల్ 25 న జరిగిన మ్యాచులో కమిందు మెండిస్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేయడంతో పాటు హర్షల్ పటేల్ బౌలింగ్ లో రాణించడంతో సన్ రైజర్స్ మూడో మ్యాచ్ గెలిచి ప్లే ఆప్స్ కు వెళ్లేందుకు ఆశలు సజీవంగా ఉంచుకుంది. అయితే మే 2వ తేదీ వరకు సన్ రైజర్స్ కు మరో మ్యాచ్ లేకపోవడంతో అందరూ ఎక్కువగా ప్రాక్టీస్ లో మునిగిపోతారని అనుకున్నారు. కానీ టీం యాజమాన్యం మాత్రం అనూహ్యంగా మాల్దీవుల ట్రిప్ కు పంపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
సన్ రైజర్స్ ఆటతీరు ఈ సీజన్ లో ఏ మాత్రం బాగుండటం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా క్యాచులు వదిలిపెడుతున్నారు. ఎప్పుడూ కింది వరుసలో ఉండే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి పాయింట్స్ టేబుల్ లో టాప్ లో కొనసాగుతుంది. గుజరాత్, పంజాబ్ కూడా రాణిస్తున్నాయి. ఆర్సీబీ కూడా అయిదు విజయాలు సాధించి పాయింట్ల టేబుల్ లో టాప్ 4 కోసం పోటీ పడుతోంది. ముంబయి వరుస విజయాలతో టాప్ 4 లో నిలిచింది. ఇలా అన్ని టీంలు ఐపీఎల్ ట్రోపీ కోసం శ్రమిస్తుంటే సన్ రైజర్స్ టీం మాత్రం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
బ్యాటింగ్ లో వైఫల్యం..
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు దూకుడు బ్యాటింగ్ తీరుతో ఓపెనింగ్ కు సరైన ఆరంభాలు దక్కడం లేదు. గతేడాది జరిగిన మ్యాచుల్లో వీరిద్దరి జోడి దూకుడుకు మిగతా జట్లు బెంబేలెత్తిపోయాయి. కాగా ఈ సీజన్ లో కూడా మొదటి మ్యాచులో రాజస్తాన్ తో కూడా 280 పరుగులపైగా స్కోరు చేసి దూకుడు చూపించింది. కానీ ఆ తర్వాతే వరుస ఓటములతో ఢీలా పడింది.
టూర్లు తర్వాత ముందు మ్యాచులు గెలవండి
సన్ రైజర్స్ ప్లేయర్లు మాల్దీవులు వెళ్లిన వీడియో వైరల్ కావడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఫామ్ కోల్పోయి.. జట్టు ప్లే ఆప్స్ కు కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉంది. నెక్ట్స్ అన్ని మ్యాచుల్లో గెలిస్తే కానీ ప్లే ఆప్స్ కు వెళ్లే చాన్స్ లేదు. ఇలాంటి సమయంలో మ్యాచులపై దృష్టి పెట్టకుండా మాల్దీవులకు వెళ్లడం ఏంటని మండిపడుతున్నారు. ముఖ్యంగాబ్యాటింగ్ ను చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని జట్లు ఎలా ప్లే ఆప్స్ కు చేరాలా అని ఆలోచన చేస్తుంటే.. వీళ్లు మాత్రం ఎంజాయ్ చేయడానికే ఐపీఎల్ ఆడుతున్నట్లు ఉందని అంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు ఈవెంట్లలో పాల్గొంటున్న సన్ రైజర్స్ జట్టు ఇప్పుడు మాల్దీవులకు వెళ్లడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3
— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025