Road works Inauguration: గ్రామంలోని రోడ్డు పనులకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద మంజూరైన నిధులతో రోడ్డుకు శ్రీకారం చుట్టారు. ఈ నిధుల కింద మంజూరైన 5 లక్షల రూపాయలతో మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలోని నూతన రోడ్డు పనులకు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి ఆదివారం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పుప్పాల చిన్న గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రోడ్డు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి చొరవ చూపి రోడ్డు పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందని వారన్నారు. గ్రామంలోని మరికొన్ని అభివృద్ధి పనులకు కూడా నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆయనను గ్రామస్తులు కోరారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group
Join Now