Sarangapani Jathakam Review: కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి ప్రస్తుతం హీరోగా యాక్ట్ చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న నటుడు ప్రియదర్శి. బలగం సినిమాలో బలం ఉన్న క్యారెక్టర్, వెబ్ సిరీస్ లు ఇలా డిఫెరంట్ కథలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ.. దర్శకత్వంలో ప్రియదర్శి మెయిన్ రోల్ లో వచ్చిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. సున్నితమైన హస్యంతో సాగిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను మెప్పించిందా లేదా
కథ ఏమిటంటే..
సారంగపాణి (ప్రియదర్శి) హ్యుందాయ్ కార్ల కంపెనీలో సేల్స్ మెన్ గా పని చేస్తాడు. అదే కంపెనీలో మైథిలీ (రూప కొడువాయూర్). సారంగ ఎక్కువగా జాతకాలు నమ్ముతాడు. కానీ హీరోయిన్ వాటిని ఏమీ పట్టించుకోదు. ఆమె ఎక్కువగా ఆధునిక భావాలున్న యువతి. ఇద్దరు ప్రేమించుకున్నట్లు తెలుసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే చేయి చూసి జాతకం చెప్పే వ్యక్తి ఒక రోజు సారంగకు కలుస్తాడు. నువ్వు ఒక మర్డర్ చేస్తావని చెబుతాడు. దీంతో మర్దర్ భయంతో పెళ్లిని వాయిదా వేసుకుంటాడు. చిన్ననాటి మిత్రుడు, తనతోపాటే పనిచేసే చందు తో అహోబిల రావును హత్య చేయాలనుకుంటారు. ఎందుకు హత్య చేయాలని అనుకుంటారు. కథ ఎంటో అంటే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
శ్రీనివాస్ అవసరాల ఎంట్రీ నుంచి ఫఉల్ నవ్వులు పండుతాయి. జాతకంలో ఉన్న మర్డర్‌ని పెళ్లికి ముందే చేయాలని ప్రియదర్శి, వెన్నెల కిశోర్ ఓ నిర్ణయానికి వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. మోహన గంటి ఇంద్రకృష్ణ తన మార్క్ ను చూపించారు. బామ్మ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. రెండో భాగంలో హీరో హీరోయిన్ల మధ్య దూరం పెంచి కూడా కామెడీని పండించిన విధానం చాలా నచ్చుతుంది. ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌కి వైవా హర్ష కామెడీకి చాలా బాగుంది. అందర్ని ఒక్క చోటకు చేర్చి కథని రసవత్తరంగా మార్చి కామెడీ పండించారు. సోషల్ మీడియాని బాగా అనుసరించే వాళ్లకి మాత్రమే కొన్ని కామెడీ సన్నివేశాలు అర్థమవుతాయి.
సారంగపాణి పాత్రలో ప్రియదర్శి లీనమై యాక్ట్ చేశాడు. ముఖ్యంగా అతడికి అచ్చి వచ్చిన కామెడీని బాగా పండించాడు. టైమింగ్‌ని అదిరిపోయింది. వెన్నెల కిశోర్ దాదాపు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించి అలరిస్తారు. రాంకీ పాత్రలో వైవా హర్ష ద్వితీయార్ధంలో చేసిన కామెడీ చాలా బాగుంటుంది. శ్రీనివాస్ అవసరాల ఎంట్రీ తర్వాత కథ, కామెడీ రెండూ దూసుకుపోతాయి. వివేక్ సాగర్ స్వరపరిచిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధానబలం అయ్యాయని చెప్పొచ్చు. ఎడిటింగ్‌తో పాటు ఇతర విభాగాలూ మంచి పనితీరుని కనబరిచాయి. సినిమాకు బలం, హస్యం, ప్రియదర్శ నటన అని చెప్పొచ్చు.