Study Loan: పీఎం విద్యాలక్ష్మి పథకం.. విద్యార్థుల చదువులకు కేంద్రం 7.5 లక్షల రుణం..

Study Loan
Study Loan

Study Loan: పీఎం విద్యాలక్ష్మి పథకం.. విద్యార్థుల చదువులకు కేంద్రం 7.5 లక్షల రుణం..

ఉన్నతమైన చదువులు చదవాలనుకుని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యను అభ్యసించాలని విద్యార్థుల కోసం “పీఎం విద్యాలక్ష్మి” పథకాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల చదువులకు 7.5 లక్షల రుణాన్ని బ్యాంకులో అందజేయనున్నాయి. అర్హత ఉండి పేదరికం అడ్డు వచ్చి పై చదువులకు వెళ్లలేకపోయిన వారికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. అర్హత ఉన్న ఆర్థిక స్థోమత లేక పై చదువులు చదువుకోలేకపోతున్న విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఒకటిగా ఉండి తన బ్యాంకింగ్ వ్యవస్థను విస్తరిస్తూ, ఎంతోమంది ఖాతాదారులకు చేరువవుతున్న “బ్యాంక్ ఆఫ్ బరోడా” కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఆర్థికంగా యువతను ప్రోత్సహించడానికి ఉన్నత చదువులకు ఆర్థికపరమైన కష్టాలు రాకుండా ఈ పథకం ద్వారా బ్యాంక్ రుణం అందజేస్తుంది.

ఈ రుణం మొత్తానికి ఎలాంటి షూరిటీ (గ్యారంటీ) లేకుండానే రుణం మంజూరు చేయడానికి బ్యాంకు ముందుకొచ్చింది. విద్యార్థులు నేరుగా రుణ సాయం కోసం ఆన్లైన్ దరఖాస్తు తీసుకునే వెసులుబాటును కూడా కల్పించింది. విద్యార్థుల ఉన్నత చదువుల అవసరాలను తీర్చడానికి దేశంలో 12 అంకితమైన విద్యారుణ బ్యాంక్ మంజూరు కేంద్రాలు (ఈ ఎల్ ఎస్ సి), 119 రిటైల్ ప్రోసెసింగ్ కేంద్రాలు, 8300 కంటే ఎక్కువ శాఖలు తమ సర్వీస్ ను అందజేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

గ్యారంటీ లేకుండానే రుణం:

విద్యార్థుల కుటుంబ సభ్యుల వద్ద ఎలాంటి ప్రాపర్టీ షూరిటీ లేకుండానే ఈ పథకం ద్వారా విద్యార్థుల ఉన్నత చదువులకు లోన్ మంజూరి చేస్తారు. దేశంలో వరుసలో ముందున్న 860 నాణ్యమైన ప్రామాణికాలు కలిగిన విద్యాసంస్థలు (క్యూహెచ్ఈఐ) లలో ఎంట్రెన్స్ కలిగిన విద్యార్థులు ఈ పథకం కింద లోన్ పొందడానికి అర్హులు. 75% లోన్ గ్యారంటీ. 7.5 లక్షల రూపాయల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. అలాగే మిగతా సొమ్మును కూడా బ్యాంకు ద్వారా రుణ సాయం అందించడానికి ఇది ప్రోత్సహిస్తుంది.

రుణంలో ఇంట్రెస్ట్ సబ్సిడీ:

ఆర్థిక ఆదాయం తక్కువ ఉన్న కుటుంబాలలోని విద్యార్థులకు ఈ పథకం ఒక మార్గదర్శకమైన దారిని చూపుతుంది. సులభంగా రుణాలు పొందే విధంగా ఇది సహకరిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు, ఉన్నతమైన చదువుల కోసం ఈ పథకాన్ని అందరికీ అందేలా అర్హత ఉన్న విద్యార్థి చదువుకునేలా లక్ష్యాన్ని చేరుకునే విధంగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది.

దళారులకు ఎక్కడ ఆస్కారం లేకుండా కంప్లీట్ ఆన్లైన్ పద్ధతిలో రుణ సాయం ఇవ్వబడుతుంది. ఈ పథకం కింద రుణంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా మరికొన్ని ఎడ్యుకేషన్ లోన్లను కూడా అందిస్తున్నట్లు సమాచారం. వారి ఆర్థిక ఆదాయం బట్టి లోన్ ఇంట్రెస్ట్ లో సబ్సిడీ నిబంధనలకు లోబడి ఉంటుంది. అంతర్జాతీయంగా ఉన్న ముఖ్యమైన కంపెనీలలో విద్యనుభ్యసిస్తున్న విద్యార్థులకు సుమారు 50 లక్షల వరకు రుణ సాయాన్ని అందించడానికి ఈ బ్యాంకు ముందుకొస్తుంది.

మరిన్ని వివరాల కోసం:

ఈ పథకం ద్వారా విద్యార్థులు లబ్ధి పొందేందుకు కావలసిన మరింత వివరాలు తెలుసుకోవడానికి దగ్గరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ మరియు పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ లో మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నిబంధనలు వర్తిస్తాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now