Home తాజా వార్తలు Curd combinations: పెరుగుతో ఈ ఆహారాలను కలిపి అస్సలు తినకూడదు.. చాలా డేంజర్

Curd combinations: పెరుగుతో ఈ ఆహారాలను కలిపి అస్సలు తినకూడదు.. చాలా డేంజర్

Curd combinations
Curd combinations

Curd combinations: ఆరోగ్యానికి పెరుగు చాలా మంచిది. అయితే పెరుగును కొన్ని రకాల పదార్థాలతో కలిపి పొరపాటున కూడా తినకూడదు. లేకపోతే అవి జీర్ణ క్రియ సమస్యలు మరియు చర్మవ్యాధులను కలిగిస్తాయి. పెరుగును ఈ కాంబినేషన్స్ తో కలిపి అసలు తినకూడదు. పెరుగును చేపలతో కలిపి పొరపాటున కూడా తినకూడదు. చేపలలో ప్రోటీన్, ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. పెరుగు చల్లని స్వభావాన్ని కలిగి ఉంటుంది. పెరుగు మరియు చేపల లక్షణాలు వ్యతిరేకంగా ఉంటాయి. పెరుగు మరియు ఉల్లిపాయను కలిపి చాలామంది ఇష్టంగా తింటారు. అయితే పెరుగు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే ఉల్లిపాయ శరీరానికి వేడిని ఇస్తుంది.

ఈ రెండిటిని కలిపి తింటే చర్మ ఎలర్జీ కలిగి దురద, తామర, సోరియాసిస్ వంటి లోపాలు శరీరంలో కలుగుతాయి. కాబట్టి పెరుగు మరియు ఉల్లిపాయ కలిపి పొరపాటున కూడా తినకూడదు. పెరుగు మరియు మామిడిపండును కలిపి చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పెరుగు శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తే మామిడిపండు శరీరానికి వేడిని పెంచుతుంది. అయితే పెరుగును మామిడిపండును కలిపి తింటే చర్మ సంబంధీంత వ్యాధులు మరియు శరీర విధులు స్తంభించడం వంటి ప్రభావాలు కూడా కలుగుతాయి.

పాలు మరియు పెరుగు ఆవుల నుంచి వస్తుంది. ఈ రెండు కూడా జంతు ప్రోటీన్ ను కలిగి ఉంటాయి. అందుకే పాలు మరియు పెరుగు రెండిటిని కలిపి తింటే విరేచనాలు, ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వంటివి ఏర్పడతాయి. పెరుగును మినప్పప్పు తో చేసిన ఆహారాలను కలిపి తింటే అది జీర్ణ క్రియ సమస్యలను కలిగిస్తుంది. దాంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య, వాపు, విరేచనాలు వంటి సమస్యలు కలుగుతాయి. నూనెతో ఉన్న ఆహారాలలో ప్రోటీన్ అధికంగా ఉన్న పెరుగును కలిపి తింటే అది జీర్ణ క్రియ సమస్యను ఆలస్యం చేయడమే కాకుండా మనల్ని త్వరగా అలిసిపోయేలా కూడా చేస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now