TS Inter Results 2025: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ ప్రకటించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ

TS Inter Results 2025
TS Inter Results 2025

TS Inter Results 2025: రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వెలువబడుతాయి అంటూ తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్షలు గత నెల 25న పూర్తి అయ్యాయి. ఇంటర్ బోర్డు పరీక్షలు పూర్తి అయిన నెల రోజుల లోపే ఫలితాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 25 లోపే ఫలితాలను ప్రకటించాలని ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తుంది. తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాల ప్రకటనపై ఇంటర్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ కృష్ణ ఆదిత్య టీవీ9తో మాట్లాడుతూ ఏప్రిల్ చివరి వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టంగా తెలిపారు.

ఇప్పటికే ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ తోపాటు రాండం రీవాల్యుయేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలిపారు. ఇక చివరి ప్రక్రియలో భాగంగా వెరిఫికేషన్ కోసం సిజిజికి పంపించినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పుకొచ్చారు. ఈనెల 20వ తేదీ నాటికి ఫలితాలు ప్రకటించేందుకు అంత సిద్ధంగా ఉంది అంటూ తెలిపారు. ఇక 20వ తేదీ తర్వాత తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మామూలుగా అయితే ఇంటర్ ఫలితాలు స్పాట్ వాల్యూయేషన్ తర్వాత సిజిజి వెరిఫికేషన్ అయిన వెంటనే ఇస్తారు.

కానీ మొదటిసారిగా స్పాట్ వాల్యుయేషన్ తర్వాత ర్యాండమ్ రీవాల్యుయేషన్ కూడా చేసి ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా 60 వేల మంది విద్యార్థులు ఒకటి రెండు మార్కుల కోసం రీవాల్యుయేషన్కు అప్లై చేస్తూ ఉంటారు. ఈసారి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ముందే తక్కువ మార్కుల తేడా అయితే ఫెయిల్ అయిన పేపర్లను మరోసారి రీవాల్యుయేషన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండడానికి ఈ ప్రక్రియ చేసినట్లు తెలుస్తోంది. ఫలితాలు విడుదల చేసిన తర్వాత కూడా విద్యార్థులు కావాలంటే రి వాల్యుయేషన్ ప్రాసెస్ కు అప్లై చేసుకుని అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now