Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. సాధారణంగా చాలామంది చీపురును లక్ష్మీదేవి లాగా కొలుస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురును ఏ దిశలో పెట్టుకోవాలో చాలామందికి తెలియదు. ఈ క్రమంలో చాలామంది ఆర్థిక సంక్షోభాలకు గురవుతూ ఉంటారు. వాస్తు, జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్పిన ప్రకారం ఇంట్లో చీపురును ఎక్కడ ఏ దిశలో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చీపురును ఇల్లు శుభ్రపరచడానికి మాత్రమే కాకుండా దానికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చీపురు లక్ష్మీదేవితో సమానం అని వాస్తు శాస్త్ర అనుపుణులు చెబుతూ ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఇంటిలో కూడా చీపురు పెట్టుకోవాలి. లేకపోతే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పవు. అయితే ఇంట్లో చీపురును పెట్టేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. లేకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో చీపురును బెడ్ రూమ్ లేదా వంట గదిలో పొరపాటున కూడా పెట్టకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురును నైరుతి దిశలో లేదా పడమర దిశలో పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చీపురును ఇంట్లో ఈశాన్యం మూలలో పెట్టకూడదు అంటూ వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈశాన్య దిశను ఇంట్లో వాస్తు శాస్త్రం ప్రకారం దైవిక శక్తి నివసించే దిశగా పరిగణిస్తారు. అలాగే చీపురును ఇంట్లో ఆగ్నేయ మూలలో కూడా పెట్టుకోవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. తూర్పు దిశలో కూడా చీపురును పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ చీపురును అందరికీ కనిపించేలాగా ఇంట్లో బహిరంగ ప్రదేశంలో పెట్టకూడదు. ఇలా ఉంచితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది.