SAVING PLAN: పిల్లల ఉన్నత చదువులు మరియు పెళ్లిళ్లకు భవిష్యత్తులో చాలా మతంలో డబ్బులు అవసరం అవుతాయి. పిల్లలు చిన్నగా ఉన్న సమయం నుంచే పొదుపు చేయడం ప్రారంభిస్తే వాళ్ళు ఉన్నత చదువులు చదువుతున్నప్పుడు లేదా వాళ్ల పెళ్లికి చేతికి డబ్బులు అందుతాయి. అయితే నాలుగేళ్ల పాప పేరుపై ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే ఆమె పెళ్లి సమయానికి రెండు కోట్ల రూపాయలు చేతికి అందుతాయో నిపుణులు ఏం చెప్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం.. తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడా పెట్టి పొదుపు చేసి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి లేదా వాళ్ల పెళ్లిళ్లకు లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఖర్చులు మరింత పెరుగుతాయి.
ఈ విధంగా ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారి కోసం పెట్టుబడులు ప్రారంభించాలని ఆర్థిక నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. పిల్లలు చిన్న వయసులో ఉన్న సమయంలోనే వాళ్ళ పేరుపై కొద్దికొద్దిగా పెట్టుబడి పెడుతూ దీర్ఘకాలం కొనసాగిస్తే వాళ్ళ ఉన్నత చదువులు, పెళ్లి ఇటువంటి వాటికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు చేతికి అందుతాయి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా ఒక తండ్రి నా పాప వయస్సు నాలుగు సంవత్సరాలు.. ఆమెకు 20 సంవత్సరాలు అంటే ఆమె పెళ్లి సమయానికి పెట్టుబడులు కొనసాగిస్తే ఎంత మొత్తం కార్పస్ జమ అవుతుంది అని అడిగిన ప్రశ్నకు నిపుణులు ఏం చెప్తున్నారు తెలుసుకుందాం.
ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఏదో ఒక ఖర్చు ఉంటూనే ఉంటుంది. ఆడపిల్ల పెళ్లి అంటూ పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో కుటుంబ పెద్ద తన వార్షిక ఆదాయానికి 12 రెట్ల వరకు ధర్మ బీమా పాలసీ తీసుకోవాలి అని నిపుణులు అంటున్నారు. ఇలా బీమా తీసుకోవడం వలన అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగి కుటుంబ పెద్ద దూరమైనా కూడా ఆ కుటుంబం రోడ్డున పడకుండా రచన లభిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. ఒక అమ్మాయి కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటే నెలకు రు.30 వేల వరకు పెట్టుబడి చేయగలిగితే రెండు కోట్ల పైన కార్పస్ ఏర్పాటు చేసేందుకు లభిస్తుంది. వాటిలో ఐదు వేలు బంగారం పండ్లకు కేటాయించాలి. మిగిలిన 25 వేల రూపాయలను డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ప్రతినెలా పొదుపు చేయాల్సి ఈ విధంగా ప్రతినెలా 30 వేల రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్లయితే అనుకున్నట్టుగా రెండు కోట్ల రూపాయలను పొందవచ్చు.