Vastu Tips: మనిషి జీవితంలో జరగబోయే సానుకూల ప్రతికూల సంఘటనల గురించి చీమలు కొన్ని సూచనలు ఇస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చీమలు అదృష్టం సంపదతో ముడిపడి ఉంటాయి అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అయితే కొంతమంది ఇంట్లోకి చీమలు ఉన్నట్టుండి కుప్పలు తిప్పలుగా వస్తూ ఉంటాయి. ఇలా అవి వస్తూ ఉంటే అవి మీకు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాయని అర్థం. చీమలు కష్టపడి పనిచేసేవి మరియు అంకితభావం నైపుణ్యం కలిగినవి. అన్నిటికంటే అత్యంత వ్యవస్థీకృత కీటకాలుగా చీమలకు పేరు ఉంది. చాలా కఠినమైన నియమాలను పెట్టుకొని అవి జీవిస్తాయి. ఎల్లప్పుడూ చీమలు వాటి పనిలో అవి నిమగ్నమై ఉంటాయి.
సాధారణంగా వంటగదిలో చీమల సమూహం ఇంట్లోకి రావడానికి చూస్తూ ఉంటాము. అయితే నల్ల చీమలను శాస్త్రంలో చాలా శుభప్రదంగా భావిస్తారు. ఒకవేళ మీ ఇంటి చుట్టూ నల్ల చీమలు తిరుగుతున్నట్లయితే త్వరలో మీ సంపదలో భారీ పెరుగుదల ఉంటుందని అర్థం. అలాగే ఎర్ర చీమలు దురదృష్టాన్ని తెస్తాయని చెప్తారు. ఇంట్లో ఎర్ర చీమలు ఉన్నట్లయితే అవి సంపద కోల్పోవడానికి సంకేతం అని నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో బియ్యం ఉన్నచోట నుండి నల్ల చీమలు బయటకు వస్తున్నట్లయితే త్వరలో మీకు ఎక్కడ నుండో డబ్బు వస్తుందని అర్థం.
ఒకవేళ మీరు మీ బంగారు ఆభరణాలను పెట్టిన చోట చీమలు కనిపిస్తే మీకు బంగారు వస్తువులు లభిస్తాయి అని అర్థం.అలాగే చీమలు ఉత్తరం నుండి వస్తున్నట్లయితే అది ఆనందానికి సంకేతం. దక్షిణం నుండి చీమలు వస్తున్నట్లయితే అది ఇంట్లో లాభాలను సూచిస్తుంది. తూర్పు నుండి వస్తున్న చీమలు అయితే ఇంట్లో ప్రతికూల వార్తలను వింటారు. అలాగే పశ్చిమ దిశ నుండి చీమలు వస్తున్నట్లయితే త్వరలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని అర్థం. ఎర్ర చీమలు ఇంట్లో చెడు సేకనాన్ని సూచిస్తాయి. ఒకవేళ అవి ఇంట్లో చూసినట్లయితే వెంటనే వాటిని తొలగించండి. ఒకవేళ ఎర్ర చీమలు నోటిలో గుడ్లు పెట్టుకొని మీ ఇంటి నుండి బయటకు వెళ్లినట్లయితే అది మంచి సంకేతం అని అర్థం.