Brain Health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన మానసిక స్థితి కూడా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవాలి. మెదడును చాలా బలంగా మరియు చురుకుగా ఉంచుకోవాలంటే ప్రతిరోజు కూడా కొన్ని ముఖ్యమైన పనులను అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా మన ఆలోచన విధానాన్ని తీర్చిదిద్దే విధంగా మార్చుకోవడం వలన మెదుడులో కొన్ని మెరుగైన మార్పులను గమనించవచ్చు. ప్రతిరోజు కూడా వీటిని పాటించడం వలన మెదడు పనితీరు చాలా మెరుగుపడుతుంది.
ప్రతిరోజు కూడా ఒకే రకమైన పనులు చేయడం వలన మెదడుకు అంతగా పని ఉండదు. ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆలోచించాల్సిన పనులను చేయడం వలన మెదడు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త స్కిల్, సంగీత సాధనా లేదా కొత్త భాష నేర్చుకోవడం వంటివి చేయడం వలన మెదడుకు కొత్త శక్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా కనీసం ఒక అరగంట పాటు నడవడం, జాగింగ్ చేయడం, వ్యాయమం చేయడం వంటివి చేయడం వలన మెదడుకు ఆక్సిజన్ ప్రవాహం మెరుగ్గా అందుతుంది. శరీరం చురుగ్గా ఉంటే మానసిక దృఢత కూడా పెరుగుతుంది. ప్రతిరోజు కూడా మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటం వలన ఒత్తిడి తగ్గుతుంది.
సామాజిక అనుబంధాలు మీ మెదడులో సంతోషకరమైన రసాయనాలను పెంచుతాయి. ఒంటరిగా ఉంటే అది నెగిటివ్ ప్రభావాన్ని చూపించి మానసికంగా బాధను కలిగిస్తుంది. ప్రతిరోజు కూడా ఆకుకూరలు, విత్తనాలు, గింజలు, పండ్లు వంటి తృణధాన్యాలను తీసుకోవడం వలన శరీరంలో మెదడుకు అవసరమైన పోషకాలు అన్నీ కూడా అందుతాయి. ముఖ్యంగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి గ్రూప్ మెదడు రక్షణలో చాలా కీలకపాత్రను పోషిస్తాయని చెప్పొచ్చు. రోజు కూడా మీరు ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకుంటే మెదడుకు పూర్తిగా విశ్రాంతి కలుగుతుంది. ప్రతిరోజు సరైన నిద్ర ఉండడం వలన రోజంతా జరిగిన విషయాలను గుర్తుంచుకునే విధంగా మెదడు ప్రాసెస్ జరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది.