Today Horoscope: అనుకున్న పనులు పూర్తవుతాయి…నేడు 12 రాశుల దిన ఫలాలు ఇవే

Today Horoscope
Today Horoscope

Today Horoscope: నేడు ఏప్రిల్ 3, 2025 నాటి రాశిఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం. వృషభ రాశి వారు అధికారుల నుంచి నమ్మకాన్ని పొందుతారు. మిధున రాశి వారి శుభవార్తలు వింటారు. నేడు 12 రాశుల రాశి ఫలాలు ఇలా ఉన్నాయి..

మేష రాశి: ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అనేక రకాలుగా ఆదాయం విస్తరిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఉద్యోగం మారడానికి ఇది సరైన సమయం. చేతికి రావలసిన డబ్బు చేతికి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభ రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని పొందుతారు. కొన్ని ప్రత్యేక బాధ్యతలు వహిస్తారు. వ్యాపారంలో యాక్టివిటీ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. ఆహార మరియు విహారాల్లో జాగ్రత్త వహించాలి. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఎవరికీ కూడా హామీలు ఇవ్వకూడదు.

మిథున రాశి: అధికారుల నుంచి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. వృత్తి మరియు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఏ పని చేసినా కూడా సఫలం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట మరియు బయట బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు ఉంటారు. ఆదాయానికి మరియు ఆరోగ్యానికి లోటు ఉండదు.

కర్కాటక రాశి: ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ సమర్థతకు మించి గుర్తింపు లభిస్తుంది. వర్తి మరియు వ్యాపారంలో కీలక మార్పులు చేయడం వలన రాబడి పెరుగుతుంది. కుటుంబ పరంగా కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆదాయం మృతి చెందుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం మరియు పెళ్లి ప్రయత్నంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది.

సింహరాశి: వృత్తి మరియు ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగంలో లక్ష్యాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఇంట మరియు బయట ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

కన్యరాశి: వృత్తి మరియు వ్యాపారంలో కొత్త పుంతలు ఉంటాయి. మీ పనితీరుతో ఉద్యోగంలో అధికారులను ఆకట్టుకుంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులకు మీరు ఇచ్చిన సలహాలు ఉపయోగపడతాయి. నిరుద్యోగులు సానుకూల వార్తలు వింటారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇప్పటినుంచి ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు.

తులారాశి: ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. మీ సూచనల వల్ల అధికారులు లాభం పొందుతారు. ఇంట మరియు బయట మీ మాటకు తిరుగుండదు. వృత్తి మరియు వ్యాపారంలో ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా రాబడి ఉంటుంది. సొంత పనుల విషయంలో శ్రద్ధ వహించాలి. ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. అనేక ఆదాయం మార్గాలు కూడా విస్తరిస్తాయి. తోబుట్టులతో ఉన్న ఆస్తివివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది.

వృశ్చిక రాశి: వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూలంగా ఉంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయ ప్రయత్నాలు లాభాలను ఇస్తాయి. ఆదాయానికేటువంటి లోటు ఉండదు. ఉద్యోగ మరియు పెళ్లి ప్రయత్నాలకు ఇది సరైన సమయం. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సఫలం అవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. మీరు అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి పార్టీల విలువ పెరుగుతుంది. గృహ మరియు వాహన ప్రయత్నాలకు ఇది సరైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి: అధికారులు ఉద్యోగంలో మీ మీద ఆధారపడతారు. వృత్తి మరియు వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఆర్థికపరంగా ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. తింటా మరియు బయట ఒత్తిడి తప్పదు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల వలన ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంది.

కుంభరాశి: అధికారుల నుంచి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భారీ లక్ష్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. కుటుంబ పరంగా శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంది.

మీనరాశి: వృత్తి మరియు ఉద్యోగంలో అనుకూలంగా ఉంది. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సొంత పనులను పూర్తి చేసుకోవడం మీద అశ్రద్ధ వహిస్తారు. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆదాయం నిలబడగా ఉంది కానీ వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now