Today’s horoscope: ఈ రాశి వారికి పుష్కలంగా ధన లాభం.. దశ తిరగనున్నరాశులు ఇవే..
నేడు మార్చి 29, 2025 నాటి 12 రాశుల దిన ఫలాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారికి ఆస్తివివాదం పరిష్కారం అవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఎప్పటినుంచో రావాల్సిన డబ్బును చేతికి అమ్ముతారు. నేటి మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల రాశి ఫలాలు ఇలా ఉన్నాయి..
మేషరాశి:
ఊరికే మరియు ఉద్యోగంలో ఆదరాభిమానాలు పొందుతారు. మీ పనితీరుకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అందుతుంది. వ్యాపారంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్ని ఇస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ అనుకొని ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ లాభసాటిగా ఉంటాయి.
వృషభ రాశి:
ఉద్యోగ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. సహచరులతో అదనపు బాధ్యతలను పంచుకుంటారు. వృత్తి మరియు వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలలో విజయవంతం అవుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
మిథున రాశి:
అనేకరకాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు మరియు స్పెక్యులేషన్లలో ఊహించిన దానికి మించి లాభాలను పొందుతారు. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితం కూడా ఉంటుంది. వృత్తి మరియు ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడికి తగిన లాభాలు వస్తాయి. ఏ ప్రయత్నం అయినా చేయడానికి ఇది సరైన సమయం. కుటుంబ జీవితం ఆనందంగా గడిచిపోతుంది.
కర్కాటక రాశి:
ఉద్యోగంలో అధికారుల నమ్మకం పొందుతారు. సహ ఉద్యోగులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి మరియు వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఏ ప్రయత్నం చేసినా కూడా మంచి ఫలితం అందుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులు మంచి ఆఫర్లు పొందుతారు. మీరు ఆశించిన పెళ్లి సంబంధం కుదిరి అవకాశం ఉంది.
సింహరాశి:
మీరు చేపట్టిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. వృత్తి మరియు ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు రెట్టింపు పొందుతారు. ఆదాయంలో బాగా పెరుగుదల ఉంటుంది కానీ కుటుంబ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. ఆర్థిక వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు శ్రమించాలి.
కన్యరాశి:
ఉద్యోగ జీవితం అనుకూలంగా ఉంది. వృత్తి మరియు వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. అనుకున్న సమయంలో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.ఆస్తివివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.
తులారాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో మీ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో లాభాలను ఇస్తాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ఇటువంటి ప్రయత్నం చేసిన కూడా ఫలితం అందుతుంది. నిరుద్యోగులు మంచి శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నంలో శుభవార్త వింటారు. సొంత పనుల మీద శ్రద్ధ వహించాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
వృశ్చిక రాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు మందకోడిగా ముందుకు సాగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఆదాయం బాగుంటుంది కానీ అనవసర ఖర్చులు తప్పవు. ఆర్థిక పరంగా ఇతరులకు మాట ఇవ్వకూడదు. ఇంట మరియు బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.
ధనస్సు రాశి:
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ పరంగా శుభవార్తలు వింటారు. వృత్తి మరియు వ్యాపారంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులను సులభంగా పూర్తి చేసుకుంటారు. వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తారు.
మకర రాశి:
ఆర్థిక విషయంలో ఆలోచించి వ్యవహరించాలి. ఆర్థికపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి మరియు ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపారాల్లో అనుకూల పరిణామాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.
కుంభరాశి:
ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. శుభవార్తలు వింటారు. వృత్తి మరియు వ్యాపారంలో భారీగా లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
మీనరాశి:
వృత్తి మరియు ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. సహ ఉద్యోగుల బాధ్యతలను కూడా నిర్వర్తించే అవకాశం ఉంది. వ్యాపారంలో పోటీ జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తాడు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది.