Govt Scheme: ₹ 1 కోటి బిజినెస్ లోన్.. ఎలాంటి తాకట్టు లేకుండా.. ఇంట్లో నుంచే అప్లై చేసుకోవచ్చు

Govt Scheme
Govt Scheme

Govt Scheme: ఒక వ్యక్తి ఇటువంటి ఆస్తులను తాకట్టు పెట్టకుండా ఒక కోటి వరకు రుణం తీసుకోవచ్చు. ఈ కోలేటరల్ ఫ్రీ ఎం ఎస్ ఎం ఈ లోన్స్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశ అభివృద్ధి మరియు ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు చాలా ముఖ్యం. కానీ ఆర్థిక సహాయం పొందడం వారికి కష్టమవుతుంది. ముఖ్యంగా వాళ్లు లోన్ పొందాలంటే ఏదైనా ప్రాపర్టీ లేదా ఎక్విప్మెంట్ వంటివి పూచికట్టుగా తాకట్టు పెట్టాలి. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఎటువంటి తాకట్టు లేకుండా వ్యాపార రుణాలను ప్రవేశపెట్టింది. ఎం ఎస్ ఎం ఈ లు ఇకపై ఎటువంటి ఆస్తులను తాకట్టు పెట్టకుండా ఒక కోటి వరకు లోన్ అప్లై చేసుకోవచ్చు.

అయితే కోలేటరల్ ఫ్రీ ఎం ఎస్ ఎం బి లోన్ అనేది చిన్న వ్యాపారులు ఎటువంటి ఆస్తులను తాకట్టు పెట్టకుండా నిధులను అందించేందుకు రూపొందించిన అన్ సెక్యూర్డ్ లోన్. ఈ సదుపాయం చిన్న కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి లేదా రోజు వారి ఖర్చలను మేనేజ్ చేసుకోవడానికి లోన్లు సులభతరం చేస్తుంది. ఈ ప్రాసెస్ లో వ్యక్తిగత మరియు వ్యాపార ఆస్తులు రిస్క్ చేయకుండా లోన్ తీసుకోవచ్చు. లోన్ అప్రూవల్ కూడా త్వరగా లభిస్తుంది.

ఈ లోన్ అప్లై చేయడానికి పేపర్ వర్క్ మరియు ఎలిజిబిలిటీ చెక్స్ తక్కువగా ఉంటాయి. నిధులు త్వరగా రిలీజ్ అవుతాయి.తమ ఆర్థిక అవసరాలను వ్యాపారులు అనుకున్న సమయంలో తీర్చుకోవడానికి ఈ నిధులు చాలా ఉపయోగపడతాయి. వ్యాపారులు తమకు నచ్చినట్టుగా తగిన లోనే అమౌంట్, వడ్డీ రేట్లు మరియు ప్రీ పేమెంట్ షెడ్యూల్ లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రమంలో చాలా బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు ఆన్లైన్లో కూడా అప్లికేషన్లను స్వీకరిస్తున్నాయి. దీంతో లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా వేగంగా మరియు సులభంగా అవుతుంది. సకాలంలో వ్యాపారులు చెల్లింపులు చేయడం వల్ల మంచికి క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేసుకోవచ్చు. ఇకపై భవిష్యత్తులో కూడా లోన్లు పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now