Tulasi Tips: శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా…!

Tulasi Tips
Tulasi Tips

Tulasi Tips: హిందూ మత సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తిని తొలగించి సానుకూల శక్తిని కలిగేలా చేస్తుంది. ఇంట్లో తులసి మొక్కను పెంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శాస్త్ర ప్రకారం తులసి మొక్కను లక్ష్మీదేవి కటాక్షంగా భావిస్తారు. ఇది ఇంట్లో సంపాద, శాంతి మరియు ఆరోగ్యం వంటి విషయాలలో మంచిని కలిగిస్తుందని నమ్ముతారు. హిందూ గృహాన్ని తులసి మొక్క లేకపోతే సంపూర్ణంగా పరిగణించరు. అయితే చాలామందిలో కలిగే సందేహం ఏమిటంటే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలు ఉండొచ్చా.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ తులసి మొక్కలను పెంచుకోవచ్చు. కానీ ఇంట్లో ఆ తులసి మొక్కలు 3,5,7 వంటి బేసి సంఖ్యలలో ఉండాలి. ఇలా బేసి సంఖ్యలో పెంచడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇంట్లో పెంచే ప్రతి తులసి మొక్కను శుభ్రంగా ఉంచాలి. వాటిని పూజ స్థలంలో చాలా గౌరవంగా ఉంచడం అవసరం. ఈ మొక్కల చుట్టూ మలినాలు, పాదరక్షలు మరియు చెత్త ఉంచడం వంటివి చేయకూడదు. ప్రతి ఉదయం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి.

ఆ మొక్కకు నీళ్లు పోయడం వంటివి చేయడం వలన ఇంట్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. తులసి మొక్కను ఇంట్లో తూర్పు లేదా ఈశాన్య దిక్కులో పెట్టుకోవడం శుభప్రదంగా చెప్తారు. తులసి మొక్కను మట్టి నేలలో కంటే కూడా కంటైనర్ లో నాటితే అది చాలా ఆరోగ్యకరంగా పెరుగుతుంది. ఆ మొక్క నేరుగా నీళ్లను తాకకుండా చూసుకోవాలి. తులసి మొక్క చుట్టూ పరిశుభ్రత ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆదివారం లేదా ఏకాదశి రోజులలో తులసి మొక్కను తాకడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి రోజులలో తులసి మొక్కకు విశ్రాంతి ఇవ్వాల్సిన రోజులు అని భావిస్తారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now