IPL MATCH: ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ రోజు సాయంత్రం ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. పాయింట్ల టేబుల్స్ పదో స్థానంలో ముంబై, తొమ్మిదో స్థానంలో సన్ రైజర్స్ ఉన్నాయి. రెండు జట్లు తన చివరి మ్యాచులో గెలిచి పామ్ లోకి వచ్చాయి. అయితే ఈ మ్యాచులో ఓడిన జట్టుకు ప్లే ఆప్స్ అవకాశాలు సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి.
సన్ రైజర్స్ బ్యాటర్ల దూకుడు..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మళ్లీ పామ్ లోకి రావడం సన్ రైజర్స్ టీంకు పెద్ద ఊరటనిచ్చే విషయం. మిడిలార్డర్ లో నితీశ్ కుమార్ రెడ్డి, క్లాసెన్ పూర్వ ఫామ్ అందుకోవాల్సి ఉంది. వీరిద్దరూ పామ్ అందుకుంటే చాలు సన్ రైజర్స్ బ్యాటింగ్ కు తిరుగుండదు. చివర్లో అనికేత్ వర్మ సిక్సులతో విరుచుకుపడే అవకాశం ఉంది. అనికేత్ వర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ పర్వాలేకున్నా.. బౌలింగ్ లో మాత్రం తేలిపోతున్నారు. ఇంటర్నేషనల్ బౌలర్లు ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నారు. దీంతో బౌలింగ్ విభాగం దారాళంగా పరుగులు ఇస్తోంది. ముంబై ఇండియన్స్ ను వాంఖడేలో ఢీకొనాలంటే బౌలింగ్ లో కట్టుదిట్టంగా బంతులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచులో స్పిన్నర్ గా రాహుల్ చాహర్ ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రోహిత్ శర్మ ఫామ్ పై ముంబై ఆందోళన..
ముంబై ఇండియన్స్ టీం ప్రస్తుతం రోహిత్ శర్మ పేలవ పామ్ పై ఆందోళన చెందుతోంది. ఇప్పటి వరకు ఆడిన అయిదు మ్యాచుల్లో రోహిత్ కేవలం 56 పరుగులు మాత్రమే చేశాడు. ఇటు టీంకు భారంగా మారినప్పటికీ అయిదు టైటిల్స్ అందించిన విజేతగా రోహిత్ శర్మను అంత ఈజీగా పక్కన పెట్టలేకపోతున్నారు. అయితే రోహిత్ శర్మ సన్ రైజర్స్ తో మ్యాచులో తిరిగి పామ్ అందుకోవాలని కోరుకుంటున్నారు. సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ డీసెంట్ గా ఆడుతున్నారు. కానీ రోహిత్ శర్మ ఓపెనింగ్ లో మరికొన్ని పరుగులు చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. వాంఖడేలో జరిగిన గత సీజన్ మ్యాచులో ముంబై బౌలింగ్ లో సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించారు సన్ రైజర్స్ బ్యాటర్లు.. మరి ఈ సారి కూడా అలాంటి మ్యాచే ఉండబోతుందని అందరూ అనుకుంటున్నారు.
బుమ్రాపై ప్రత్యేక దృష్టి..
సన్ రైజర్స్ బౌలింగ్, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పై దృష్టిపెడితే చాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. గత మ్యాచులో భీకరంగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మను కట్టడి చేసేందుకు ముంబై ఇండియన్స్ ప్లాన్స్ రచిస్తోంది. ఇటు ముంబై ఇండియన్స్ బౌలింగ్ లో బుమ్రాను ఆపగలిగితే చాలు ఈజీగా గెలవవచ్చు అని సన్ రైజర్స్ భావిస్తోంది.