IPL: గుజరాత్ టైటాన్స్ చెత్త ఫీల్డింగ్.. నెట్టింట ట్రోల్స్

IPL
IPL

IPL: గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ మధ్య గత రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ నెగ్గగా.. ఆ మ్యాచులో చెత్త ఫీల్డింగ్ తో గుజరాత్ టైటాన్స్ ను నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ఫీల్డింగ్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పటి పాకిస్థాన్ ఫీల్డింగ్ లా ఉంది గుజరాత్ ఫీల్డింగ్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయగా.. మొదటి ఓవర్ లోనే ఫామ్ లో ఉన్న రానే రికల్టన్ రెండు పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విల్ జాక్స్ తన ఎదుర్కొన్న రెండో బంతికే క్యాచ్ ఇవ్వగా సాయి సుదర్శన్ వదిలేశాడు. ఈజీ క్యాచ్ వదిలేయడంతో విల్ జాక్స్ ఏకంగా హాప్ సెంచరీ బాదేశాడు. సాయి సుదర్శన్ క్యాచ్ డ్రాప్ చేయడంతో మొదటి ఓవర్ లోనే రెండో వికెట్ కోల్పోవాల్సిన ముంబై ఇండియన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంది.

మొదటి ఆరు ఓవర్లలోనే గుజరాత్ ఫీల్డర్లు ఏకంగా మూడు క్యాచులను డ్రాప్ చేశారు. అందులో మొదటిది విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ సాయి సుదర్శన్ డ్రాప్ చేయగా.. ఆ తర్వాత అర్షద్ ఖాన్ బౌలింగ్ లో సాయి కిశోర్ సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ ను విడిచిపెట్టాడు. అనంతరం సూర్య కుమార్ 35 పరుగులతో రాణించాడు. ఆఖరికి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా విల్ జాక్స్ ఇచ్చిన క్యాచ్ జారవిడవంతో వీళ్లు గుజరాత్ టైటాన్స్ ఫీల్డర్స్ కాదు.. పాకిస్థాన్ ఫీల్డర్లలాగా చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అటు ముంబై ఇండియన్స్ టీం లో కూడా చేతిలోకి వచ్చిన ఈజీ క్యాచ్ ను తిలక్ వర్మ నేలపాలు చేశాడు. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్ ఇచ్చిన క్యాచ్ ను తిలక్ వర్మ నేలపాలు చేయడంతో మ్యాచులో గుజరాత్ పై చేయి సాధించింది. ఆఖరుకు హర్దిక్ పాండ్యా రనౌట్ మిస్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠ పోరులో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ కు చేరుకుంది. ఈ మ్యాచులో ఫీల్డింగ్ తీరు చూస్తే వీరి కంటే గల్లీ క్రికెటర్లు బెస్ట్ అనేలా చేశారు. మరి చేతిలోకి వచ్చిన క్యాచులు విడిచిపెడుతుంటే చూసే వారికి కూడా ఇంత చెత్త ఫీల్డింగా అంటూ పెదవి విరిచారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now