Todays Horoscope: ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. ఈ వారం 12 రాశుల రాశి ఫలాలు..
నేడు ఏప్రిల్ 13, 2025 మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి:
ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న పనులు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు విని అవకాశం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు జరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. వారం చివరలో స్వల్ప అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. శ్రమ బాగా పెరుగుతుంది.
వృషభ రాశి:
పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో మిత్రులతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహన యోగం ఉంది. నిరుద్యోగదా ఒక మంచి అవకాశాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆస్తి విషయంలో ఉన్న వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. రాజకీయ రంగంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో ధన వ్యయం కలుగుతుంది మరియు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
మిథున రాశి:
గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం పొందుతారు. ఆర్థిక విషయంలో పురోగతి ఉంటుంది. భూ వివాదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంది. మీ లోని ప్రతిభ అందరికీ తెలుస్తుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో ముందుకు వెళ్తారు. వ్యాపారంలో బాగా రాబడి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఒత్తిడి తప్పదు.
కర్కాటక రాశి:
పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మీరు తీసుకొని నిర్ణయాల వలన లాభాలు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు అందుతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం మధ్యలో ధనవ్యాయం కలుగుతుంది. కుటుంబంలో చికాకులు ఏర్పడే అవకాశం ఉంది.
సింహరాశి:
ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ఆర్థిక వ్యవహారాలు నత్తనడగన సాగుతాయి. బంధువులతో కలహాలు ఏర్పడవచ్చు. నిరుద్యోగులకు నిదానంగా అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. స్వల్ప ధన లాభం కలుగుతుంది.
కన్య రాశి:
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. ఆర్థికపరంగా వృద్ధి చెంది రుణాలను తీర్చుకుంటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆస్థి వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వాహనం మరియు గృహ యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వారం చివరలో మిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.
తులా రాశి:
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. కాంట్రాక్టులు హ్యాపీగా సాగుతాయి. వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోయి లాభాలు. ఉద్యోగంలో మీ మాటకు విలువ ఉంటుంది. వారం ప్రారంభంలో ధన వ్యయం కలుగుతుంది. అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి:
మీ పనులు పూర్తి అవుతాయి. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వాహన యోగం ఉంది. వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి నుంచే ఉపశమనం పొందుతారు.
ధనస్సు రాశి:
అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. ఆర్థికంగా బలం ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట బయట గుర్తింపు దక్కుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు బాగా పొందుకుంటాయి. ఉద్యోగంలో ఉన్న వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. వారం చివరలో ధన వ్యయం కలుగుతుంది. విమర్శలు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
మకర రాశి:
అనుకున్న పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో అనుకున్న మార్పులు చేపడుతారు. రాజకీయ పదవులు లభించే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది.
కుంభరాశి:
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహితుల సహకారంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలను విస్తరింప చేయడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
మీన రాశి:
ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. వాహనాలు మరియు భూములను కొన్ని అవకాశం ఉంది. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిడి నుంచి బయట పడతారు. వారం మధ్యలో వ్యయ ప్రయాసలు కలిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంది.