Phone Danger: ఫోన్ తో పెను విషాదం

Phone
Phone

Phone Danger: వెబ్ డెస్క్, ఆగస్టు 12 (ప్రజా శంఖారావం): ఆ ఫోన్ కుటుంబంలో పెను విషాదం నింపింది. అజాగ్రత్తగా ఉంటే ఎంతటి ప్రమాదం జరుగుతుందో చూడండి. ఖమ్మం పట్టణ కేంద్రంలోని స్థానిక కాల్వ ఒడ్డున ఉన్న హనుమాన్ ఆలయ సమీపంలో నివసిస్తున్న ధోనిపూడి మహేష్ బాబు (40) తన పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీటి కోసం హీటర్ ఆన్ చేయబోయాడు.

ఈలోగా తనకు ఫోన్ రావడంతో ఆ కాల్ అటెండ్ చేసి హీటర్ ను నీటిలో ఉంచే బదులు చంకలో పెట్టుకొని స్విచ్ బటన్ ఆన్ చేశాడు. దీంతో అతకి విద్యుత్ షాక్ తగలడంతో కింద పడిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆ పాటికే మహేష్ మృతి చెందినట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now