Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు జీవితంలో పతనానికి కారణం అవుతాయి. సరైన సమయంలో వాటిని సరిదిద్దుకోలేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జీవితంలో కొన్ని విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలని ఆచార్య చాణిక్యుడు చెప్తున్నారు. చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, గొప్ప తెలివితేటలు మరియు జ్ఞానం సహాయంతో మౌర్య సామ్రాజ్య స్థాపనలో ఈయన ముఖ్య పాత్ర పోషించాడు. నీతి శాస్త్రంలో ఆయన చెప్పిన విధానాలు మనిషి జీవితంలో మంచి మార్పులను తీసుకొని వస్తాయి. వ్యక్తిగత మరియు సామాజిక విషయాలపై కూడా వీటితో అవగాహన కలుగుతుంది.
మనిషి జీవితంలో కొన్ని అలవాట్లు ముఖ్యమైన పనులను నాశనం చేస్తాయని ఆచార్య చాణిక్యుడు చెబుతున్నారు. మనిషి జ్ఞానం కోల్పోవడానికి సోమరితనం ముఖ్య కారణం అంటూ చాణిక్యుడు చెప్తున్నారు. చాలామంది తమ సోమరితనం కారణంగా చదువుపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు. వారికున్న సోమరితనం కారణంగా జ్ఞానం నెమ్మదిగా తగ్గుతుంది. డబ్బు విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్త వహించాలి. వేరే వాళ్లకు మీరు డబ్బును నమ్మకంగా ఇచ్చినప్పుడు వాళ్లు మళ్ళీ తిరిగి మీకు ఇస్తారన్న నమ్మకం ఉండదు.
కాబట్టి ఇతరుల చేతిలో పెట్టి డబ్బులు మోసపోవడం కంటే మీ చేతుల్లో ఉన్నప్పుడే జాగ్రత్త వహించడం మంచిది. ఏ పని చేయాలన్నా కూడా కష్టపడాలి. చదువు, ఉద్యోగం ఇలా ప్రతి విషయంలో కూడా శ్రమ పడాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆ పనిలో విజయం సాధించగలుగుతారు. ఒక మనిషికి నాయకత్వ లక్షణాలు ఉండడం చాలా అవసరమని ఆచార్య చానిక్యుడు చెప్తున్నాడు. ఒక జట్టు విజయం సాధించాలంటే దానికి బలమైన నాయకుడు ఉండడం అవసరం. ఆచార్య చాణుక్యుడి నీతి శాస్త్రం ప్రకారం ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలంటే అతనికి సోమరితనం ఉండకూడదు. అలాగే ఏ పని చేయాలన్నా కూడా కష్టపడాలి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ప్రతి పనికి నాయకత్వం వహించాలి.